logo

తెదేపాతోనే బీసీలకు స్వాతంత్య్రం

రాష్ట్రంలోని బీసీలకు తెదేపా ఆవిర్భావంతోనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు అన్నారు.

Published : 05 May 2024 03:53 IST

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ రామ్మోహనరావు, చిత్రంలో కూటమి అభ్యర్థి ముప్పిడి

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని బీసీలకు తెదేపా ఆవిర్భావంతోనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు అన్నారు. కొవ్వూరు నియోజకవర్గ తెదేపా కార్యాలయంలో జయహో బీసీ కార్యక్రమాన్ని కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన రామ్మోహనరావు మాట్లాడుతూ తెదేపా ఆవిర్భావం నుంచి బీసీలు పార్టీకి వెన్నుముకగా ఉన్నారన్నారు. పల్లకీ మోసే స్థితి నుంచి పల్లకీ ఎక్కే స్థాయికి ఎదిగారంటే కారణం తెదేపా అన్నారు. 33 శాతం ఉన్న రిజర్వేషన్లను వైకాపా ప్రభుత్వం 10 శాతం తగ్గించిందని, వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే 34 శాతం రిజర్వేషన్ల కల సాకారం కానుందన్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవులతో పూర్వవైభవం రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. రిజర్వేషన్ల కారణంగా వైకాపా పాలనలో 17 వేల పోస్టులను బీసీలు కోల్పోయారన్నారు. రాష్ట్రంలో 56 కార్పొరేషన్లకు విధులు, నిధులూ లేవన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు గొర్రెల శ్రీధర్‌ మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి తెదేపా పాటుపడితే వారిని వైకాపా ప్రభుత్వం వంచించిందన్నారు. బీసీలపై రాష్ట్రవ్యాప్తంగా తప్పుడు కేసులు బనాయించి ప్రాబల్యాన్ని అణచివేసిందన్నారు. ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీతో బీసీల బంధం పటిష్ఠమైందన్నారు. జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంఠమణి రామకృష్ణ, సూరపనేని చిన్ని, అర్జెల్లి రామకృష్ణ, కాగిత రఘు, రొంగల గోపి శ్రీనివాస్‌, కూరగంటి సతీష్‌ తదితరులు మాట్లాడారు.  వేములూరుకు చెందిన వార్డు మెంబరు చిమ్మ సత్యవతి కుటుంబం, అనుచరులతో కలసి తెదేపాలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని