logo

మీడియా ప్రతినిధులకూ పోస్టల్‌ బ్యాలట్‌ అవకాశం

జిల్లాలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులు తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా వినియోగించుకునే వెసులుబాటును రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదివారం

Published : 06 May 2024 05:46 IST

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌: జిల్లాలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులు తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా వినియోగించుకునే వెసులుబాటును రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు తాము ఓటు హక్కు కలిగి ఉన్న నియోజకవర్గాల్లోని రిటర్నింగ్‌ అధికారులకు ఈ నెల 8న ఫారం-12 దరఖాస్తులు అందజేసి పోస్టల్‌ బ్యాలెట్‌ పొందవచ్చన్నారు. సాధారణ ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియ కవరేజీ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా ప్రతినిధులకు అథారిటీ లెటర్స్‌ జారీ చేసినట్లు ఈ సందర్భంగా కలెక్టర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని