logo

విపత్కర పాలనను సాగనంపడానికే కూటమి: పురందేశ్వరి

రాష్ట్రంలోని విపత్కర పాలనను విచ్ఛిన్నం చేయడానికి కూటమి ఆవిర్భవించిందని కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Published : 06 May 2024 05:50 IST

ప్రచారంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పురందేశ్వరి, ముప్పిడి వెంకటేశ్వరరావు, హీరో నారా రోహిత్‌

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని విపత్కర పాలనను విచ్ఛిన్నం చేయడానికి కూటమి ఆవిర్భవించిందని కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, నాయకులతో కొవ్వూరు పట్టణం, మండలంలో ఆదివారం ప్రచారం చేశారు. ప్రజలు నీరాజనాలు పలికారు. ప్రచార రథం ముందు వెనుక కార్లు, ద్విచక్రవాహన ప్రదర్శన సాగింది. పురందేశ్వరి మాట్లాడుతూ మహానుభావులు నడయాడిన, తెలుగుకు వెలుగులు దిద్దిన చారిత్రక, ఆధ్యాత్మిక నగరానికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కిందన్నారు. హీరో నారా రోహిత్‌ మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, పురపాలక మాజీ అధ్యక్షులు సూరపనేని చిన్ని, జొన్నలగడ్డ రాధారాణి, దాయన రామకృష్ణ, వట్టికూటి వెంకటేశ్వరరావు, మద్దిపాటి సత్యనారాయణ, కాకర్ల సత్యనారాయణ, ఆళ్ల హరిబాబు, పరిమి రాధాకృష్ణ, టి.విజయలక్ష్మి, మాట్ల ఆంజనేయులు, బీవీ ముత్యాలరావు, డేగల రాము, నవ్య తదితరులు పాల్గొన్నారు.

మహిళల రక్షణకు ప్రత్యేక దళం

టి.నగర్‌: మహిళల రక్షణ తమ బాధ్యతని ఎంపీ అభ్యర్థి ఫురందేశ్వరి తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం రాజస్థానీ, గుజరాతీయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ నేతృత్వంలో ‘రాజమహేంద్రవరం రక్షాదళం’ పేరుతో మహిళల డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో ఎక్కువగా నేరాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి నిరంతరం గస్తీ కోసం ప్రత్యేకంగా ఒక దళం ఏర్పాటు చేస్తామన్నారు. దశల వారీగా సీసీరోడ్లు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సోము వీర్రాజు, కాశీ నవీన్‌కుమార్‌, అత్తి సత్యనారాయణ, రెడ్డి మణేశ్వరరావు, రంగబాబు, చల్లా శంకర్రావు, బొమ్ముల దత్తు, రామకృష్ణ, వీరన్న చౌదరి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని