logo

జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు

మంగళగిరి పరిధిలోని ఆత్మకూరులో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ మంగళవారం ఉదయం పరిశీలించారు.

Published : 07 Dec 2022 04:21 IST

విద్యార్థిని అభినందిస్తున్న ప్రవీణ్‌ప్రకాష్‌

ఆత్మకూరు(మంగళగిరి), న్యూస్‌టుడే: మంగళగిరి పరిధిలోని ఆత్మకూరులో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ మంగళవారం ఉదయం పరిశీలించారు. దాదాపు గంటపాటు పాఠశాలలో గడిపారు. ఎఫ్‌ఏ-2 పరీక్షల్లో మార్కుల వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. వారితో బృంద చిత్రాన్ని తీసుకున్నారు. అనంతరం ఏడో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. జగనన్న విద్యాకానుకలపై ఆరా తీశారు. పాఠశాల ఆవరణలో నీటిశుద్ధి పరికరాలను తనిఖీ చేశారు. డీఈవో శైలజ, డిప్యూటీ డీఈవో నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని