Andhra news: ఎన్నికల వేళ.. ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు

సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో మరో ఉన్నతాధికారిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.

Updated : 16 Apr 2024 16:44 IST

అమరావతి: సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో మరో ఉన్నతాధికారిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాసుదేవరెడ్డిని తక్షణం విధుల నుంచి తొలగించాలని, ఎన్నికల విధులు అప్పగించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రత్యామ్నాయంగా ముగ్గురు ఐఏఎస్‌ల పేర్లతో జాబితా ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. మంగళవారం రాత్రి 8గంటల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు వైకాపా నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున స్టాక్‌ పెట్టుకుంటున్నారని, వారికి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌, ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తున్నాయని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇటీవల ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డిని వెంటనే బదిలీ చేయాలని ఆయన ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్టు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని