logo

వైకాపా ఎమ్మెల్యే అవినీతికి అడ్డుకట్ట వేయాలి : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి

వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా అవినీతికి అడ్డుకట్టు వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ మస్తాన్ వలీ అన్నారు.

Published : 06 May 2024 12:12 IST

గుంటూరు( పట్నం బజార్ ) : వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా అవినీతికి అడ్డుకట్టు వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ మస్తాన్ వలీ అన్నారు. సోమవారం ఆయన సంజీవయ్య నగర్, శివ నాగరాజు కాలనీ, కొత్తపేట ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం గంజాయి, మద్యం, ఇసుక మాఫియాలకు అడ్డాగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపేందుకు  సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా నియోజకవర్గంలోని దేవాలయ భూములను ఆక్రమించి తన అనుచరులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని