logo

అయిదుగురు హెచ్‌ఎంలకు మెమోలు

ఓవైపు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు.

Updated : 09 May 2024 06:36 IST

విద్యార్థుల ప్రత్యేక తరగతులకు అందుబాటులో లేరంటూ నోటీసు

పోస్టల్‌ బ్యాలట్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకేనని సంఘాల ఆగ్రహం

 గుంటూరు విద్య, న్యూస్‌టుడే: ఓవైపు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎందుకు అందుబాటులో లేరని..వెంటనే సమాధానం ఇవ్వాలని ఉప విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు బుధవారం ఐదు పాఠశాలల హెచ్‌ఎంలకు మెమోలు జారీ చేశారు. స్తంభాలగరవు నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల, కేవీపీ కాలనీలోని నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల, పాతగుంటూరు యాదవ హైస్కూల్‌, పీవీ తోట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల తనిఖీ చేయగా ఉపాధ్యాయులు అందుబాటులో లేరని, దీనికి వెంటనే వివరణ ఇవ్వాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ప్రత్యేక తరగతుల నిర్వహణకే ఉత్తర్వులు లేకుండా..ఇలా హెచ్‌ఎంలకు మెమోలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తర్వులు వెనక్కి తీసుకోకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఉపాధ్యాయులను పోస్టల్‌ బ్యాలట్‌కు వెళ్లకుండా చేసేందుకే కొందరు ఉన్నతాధికారులు ఇలాంటి చర్యలు చేపడుతున్నారని పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని