Telangana news: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. తప్పిన ప్రమాదం

ముంబయి నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.

Published : 27 Jun 2022 09:56 IST

డోర్నకల్‌: ముంబయి నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీలో పొగలు రావడంతో రైలును డోర్నకల్ జంక్షన్‌ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే డోర్నకల్ జంక్షన్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకొని మరమ్మతు చర్యలు చేపట్టారు. పొగలు వ్యాపించిన బోగీని వేరు చేసి ప్రయాణికులను మరో బోగీలోకి తరలించారు. ఈ ఘటన వల్ల ప్రయాణికులెవరూ ఇబ్బంది పడలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. ఏసీ బోగీలో పొగలు రావడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని