logo

కేవైసీ పేరిట మున్సిపల్‌ ఉద్యోగికి టోకరా

కేవైసీ పేరుతో మున్సిపల్‌ ఉద్యోగికి సైబర్‌ నేరగాళ్లు టోకరా వేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్‌లో నివసించే మున్సిపల్‌ ఉద్యోగి ఆర్‌.శ్రీధర్‌రావు...

Published : 28 Mar 2023 02:28 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: కేవైసీ పేరుతో మున్సిపల్‌ ఉద్యోగికి సైబర్‌ నేరగాళ్లు టోకరా వేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్‌లో నివసించే మున్సిపల్‌ ఉద్యోగి ఆర్‌.శ్రీధర్‌రావు చరవాణికి ఈనెల 6న బ్యాంకు ఖాతాకు సంబంధించి పాన్‌ కార్డు నవీకరణతోపాటు కేవైసీ చేసుకోవాలంటూ సంక్షిప్త సందేశం వచ్చింది. దీంతో లింకును తెరిచి వివరాలు పొందుపరిచి, వచ్చిన ఓటీపీని నమోదు చేశారు. దీంతో ఖాతా నుంచి రూ.39,999 విత్‌డ్రా అయినట్లు సందేశం వచ్చింది. ఈ మేరకు ఆయన జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని