logo

Hyderabad Metro Rail: మెట్రో బ్రేకేస్తే విద్యుదుత్పత్తి

మెట్రోరైలు కరెంట్‌ వాడుకోవడమే కాదు అందులో సగం తిరిగి ఉత్పత్తి చేస్తోంది. మెట్రోలో రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ ఉన్న సంగతి తెలిసిందే. మెట్రోరైళ్లు నడిచేందుకు కావాల్సిన ట్రాక్షన్‌ విద్యుత్తులో 40 శాతం బ్రేకింగ్‌ ద్వారానే తయారవుతోంది.

Updated : 18 Jul 2023 07:37 IST

గత ఆర్థిక సంవత్సరంలో 36 మిలియన్‌ యూనిట్ల పునర్వినియోగం
ఈనాడు, హైదరాబాద్‌

మెట్రోరైలు కరెంట్‌ వాడుకోవడమే కాదు అందులో సగం తిరిగి ఉత్పత్తి చేస్తోంది. మెట్రోలో రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ ఉన్న సంగతి తెలిసిందే. మెట్రోరైళ్లు నడిచేందుకు కావాల్సిన ట్రాక్షన్‌ విద్యుత్తులో 40 శాతం బ్రేకింగ్‌ ద్వారానే తయారవుతోంది. గత ఆర్థిక సంవత్సరం 36 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును మెట్రో బ్రేకింగ్‌తో  ఉత్పత్తి చేసింది. ఇది హైదరాబాద్‌లో సగం ప్రాంతానికి ఒకరోజు సరఫరాకు సమానం. 6500 ఇళ్లకు ఏడాదిపాటూ సరిపడే విద్యుత్తు.

11 మిలియన్‌ యూనిట్లు..

మెట్రోరైలుకు చెందిన రెండు డిపోలు, 28 స్టేషన్లపై సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వీటి సామర్ధ్యం 8.35 మెగావాట్లు. కొత్తగా మరో 5.5 మెగావాట్ల సౌర విద్యుత్తు ఫలకలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న ప్లాంట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 11 మిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి చేశారు. మెట్రో మొత్తం కరెంట్‌ వినియోగంలో ఇది పది శాతం.

1750 చెట్లతో సమానం..

మెట్రోలో ప్రయాణించడం ద్వారా గత ఆర్థిక సంవత్సంలో వాతావరణంలో కలిసే కార్బన్‌ డై యాక్సైడ్‌ 88 మిలియన్‌ కిలోలు ఉత్పత్తి కాకుండా చేయగలిగారు. ఇది 1750 చెట్లతో సమానం. 28 మిలయన్‌ లీటర్ల పెట్రోలు, డీజిల్‌ ఆదా అయ్యింది. 2040 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా శాతానికి తేవాలనేది ఎల్‌అండ్‌టీ లక్ష్యం. 

ఎక్కువ ప్రయాణిస్తే మరింత ప్రయోజనం

మెట్రోలో ఏడాది కాలంలో సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తే పర్యావరణపరంగా అనేక ప్రయోజనాలున్నాయని, ట్రాఫిక్‌ తగ్గాలన్నా.. కాలుష్యం హద్దులు దాటొద్దన్నా ఈ సంఖ్య మరింత పెరగాలని గతంలో మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలో 15 లక్షల మంది మెట్రోలో రాకపోకలకు అవకాశం ఉందని తెలిపారు.
* నగరం నివాసయోగ్యంగా ఉండాలంటే కాలుష్యాన్ని నియంత్రించాలి. అవకాశం ఉన్న చోట ప్రజారవాణాను ఉపయోగించాలి. వారంలో ఒకరోజు వాహనాన్ని వదిలి ప్రయాణించేలా అలవాటు చేసుకోవాలి.
* ప్రజారవాణా వాడకం పెరగాలంటే ప్రయాణికుడు గమ్యస్థానం దాకా చేర్చే నమ్మదగిన ప్రయాణ వ్యవస్థను పెంపొందించాలి. ః మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌, ఆటో, క్యాబ్‌లన్నింటినిలో చెల్లుబాటు అయ్యేలా కామన్‌ మొబిలిటీ స్మార్ట్‌కార్డు అందుబాటులోకి  రావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని