logo

ఎంఎన్‌జేలో రొమ్ము పునర్‌ నిర్మాణ శస్త్రచికిత్సలు విజయవంతం

మారిన జీవన విధానం, అహారపు అలవాట్ల కారణంగా చాలా మంది క్యాన్సర్‌ బారిన కూడా పడుతున్నారు.

Published : 03 May 2024 03:23 IST

రెడ్‌హిల్స్‌: మారిన జీవన విధానం, అహారపు అలవాట్ల కారణంగా చాలా మంది క్యాన్సర్‌ బారిన కూడా పడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ సర్వసాధారణమైంది. చాలా మందికి రొమ్ము తీసేస్తారేమోనన్న భయం ఉంటుంది. మరికొందరు రొమ్ము తీయించుకొని వెళ్లిపోతుంటారు. కానీ నగœరంలోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో సవాలుతో కూడిన ఆత్యాధునిక పద్ధతి మైక్రోవ్యాస్కులర్‌ సర్జరీ ద్వారా తొలగించిన రొమ్ము స్థానంలో శరీరంలోని మరోభాగంతో ‘పునర్‌ నిర్మాణం’ (బ్రెస్ట్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌) చేస్తున్నారు.  ఆడవాళ్ల పొట్ట దగ్గరుండే ‘ఫ్యాట్‌’ (కొవ్వు)ను తీసి, రొమ్ముస్థానంలో దానిని ఏర్పాటు చేస్తారు. ఇదొక సవాలుతో కూడుకున్న శస్త్రచికిత్స అని ఆస్పత్రి డాక్టర్‌ శ్రీనాథ్‌ చెబుతున్నారు. దీని ద్వారా ఇతర సమస్యలు ఉండవు.  పునర్‌ నిర్మాణం తరువాత అచ్చమైన రొమ్ములాగానే ఫీలింగ్‌ ఉంటుందన్నారు. ఇదే శస్త్రచికిత్సను ప్రైవేటులో చేయించుకుంటే కనీసం రూ.5 లక్షలకు పైగానే ఖర్చవుతుంది. కానీ ఎంఎన్‌జే ఆసుపత్రిలో ఉచితంగానే చేస్తున్నారు.


తక్కువ ఖర్చుతో రొమ్ము క్యాన్సర్‌ నిర్ధరణ కిట్‌  

ఈనాడు,హైదరాబాద్‌: రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న  రోగులకు ఉపశమనం కల్పించడంతో పాటు  ముందస్తుగా వ్యాధిని గుర్తించేందుకు కిట్‌ను హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ ఎలిసిటిన్‌ తయారు చేసింది.  కిట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, మరింత సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసేందుకు అమెరికా కేంద్రంగా కొనసాగుతున్న వివి బయోలాజిక్స్‌తో గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని అస్పైర్‌-బయోనెస్ట్‌ కేంద్రంలో ఈ సంస్థల ప్రతినిధులు ఒప్పంద ప్రతులను మార్చుకున్నారు.  వివి బయోలాజికల్‌ సంస్థను హెచ్‌సీయూ పూర్వ విద్యార్థి, క్యాన్సర్‌ వ్యాధి పరిశోధకులు డాక్టర్‌ కిరణ్‌ వేల్పుల అమెరికాలో స్థాపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని