logo

Hyderabad: నేడు అతిభారీ వర్షాలు.. హైదరాబాద్‌కు ప్రమాద హెచ్చరిక

నగరంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

Updated : 26 Jul 2023 07:10 IST

గంటలో 3 నుంచి 5 సెం.మీ...

ఈనాడు, హైదరాబాద్‌ : నగరంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. జోన్లవారీగా హెచ్చరికలు జారీ చేసింది.

ఈ జోన్ల పరిధిలో.. 

  • చార్మినార్‌ జోన్‌, ఖైరతాబాద్‌ జోన్‌, ఎల్బీనగర్‌ జోన్‌, శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కూకట్‌పల్లి జోన్‌కు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ సైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
  • గంటలో 3 నుంచి 5 సెం.మీ. వర్షం కురిసే సూచనలున్నాయని, కొన్నిసార్లు 5 నుంచి 10 సెం.మీ. కూడా కావచ్చని వెల్లడించింది. గంటకు 10 నుంచి 14 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

రెడ్‌ అలర్ట్‌ ఎందుకంటే..?

  • భారీ నుంచి అతి భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమవుతాయి. గాలులతో చెట్లు నేలకూలే ప్రమాదం ఉంది. విద్యుత్తు స్తంభాలు దెబ్బతినడం, కరెంటు సరఫరాలో అంతరాయాలకు అవకాశం.
  • చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తవచ్చు.

రేపు ఇలా..  ఐదు జోన్ల పరిధిలో ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. వీటి పరిధిలో గురువారం మోస్తరు నుంచి కొన్నిసార్లు భారీ వర్షం కురియవచ్చు. శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం  ఉండవచ్చని వెల్లడించింది.  గంటలో 2 నుంచి 3 లేదా 5 సెం.మీ. దాకా వర్షపాతానికి వీలుంది.

మోస్తరు వాన పడింది.. నగరంలో మంగళవారం అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. ఒక చోట మోస్తరు వాన పడగా, మరోచోట భారీగా కురిసింది. ఆసిఫ్‌నగర్‌లో 43.5 మి.మీ., టోలిచౌకిలో 19.8 మి.మీ. వర్షం పడినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సొసైటీ(టీఎస్‌డీపీఎస్‌) వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో 10 మి.మీ.లోపే పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు