logo

APSRTC: దసరాకు వెయ్యి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

దసరా పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్‌ఆర్టీసీ వెయ్యి ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమయ్యంది.

Updated : 12 Oct 2023 07:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: దసరా పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్‌ఆర్టీసీ వెయ్యి ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమయ్యంది. ప్రతి రోజూ హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పట్టణాలకు నడుపుతున్న బస్సులకు అదనంగా ఇవి ఉంటాయి. సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నామని ఏపీఎస్‌ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ కిశోర్‌నాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి 23 వరకు ఈ ప్రత్యేక బస్సులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. ఈ నెల 21 నుంచి 23 వరకు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్లవైపు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్‌ నుంచి కాకుండా ఎదురుగా ఉన్న పాత సీబీఎస్‌ హ్యాంగర్‌ నుంచి నడుపుతున్నట్టు పేర్కొన్నారు. ఎంజీబీఎస్‌లో రద్దీ నియంత్రించడానికి ఈ ఏర్పాట్లు చేశామన్నారు.  www.apsrtconline.in  వెబ్‌సైట్‌తో పాటు అధీకృత ఏటీబీ ఏజెంట్ల ద్వారా టిక్కెట్లు రిజర్వేషన్‌ చేసుకోవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని