logo

Hair loss: పాతికేళ్లకే జుట్టు రాలే సమస్య.. 50% మంది ఆ వయసు వారే!

పాతికేళ్లు రాకముందే చాలామందిలో జుట్టు రాలే సమస్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా జరిగిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది.

Updated : 17 Oct 2023 09:22 IST

దేశవ్యాప్తంగా అధ్యయనం

ఈనాడు, హైదరాబాద్‌: పాతికేళ్లు రాకముందే చాలామందిలో జుట్టు రాలే సమస్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా జరిగిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ దేశవ్యాప్తంగా 50 వేల మంది పురుషులపై అధ్యయనం చేసింది. సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. జుట్టు రాలే సమస్య ఉన్న భారతీయ పురుషుల్లో 50.31 శాతం మంది 25 ఏళ్లలోపు వారేనని అధ్యయనంలో గుర్తించారు. 21 ఏళ్ల కంటే తక్కువ వయసు వారిలోనూ 25.89 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సగటున 28 ఏళ్ల వారిలో జట్టు రాలడం తీవ్ర ఆందోళనగా మారిందని అధ్యయనం పేర్కొంది. జుట్టు రాలే సమస్య ఉన్న వారిలో 65 శాతం చుండ్రుతోనూ బాధపడుతున్నట్లు గుర్తించారు. కేశాలు రాలే వారిలో ప్రతి పది మందిలో ఆరుగురు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. దీనికితోడు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఇందుకు దోహదం చేస్తున్నట్లు నిపుణులు తెలిపారు. జీర్ణకోశ సమస్యలైన ఉబ్బరం, గ్యాస్‌, ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందక.. ఆ ప్రభావం జట్టు ఆరోగ్యంపై పడుతుందన్నారు. జుట్టు రాలే సమస్య ఉన్న ప్రతి పది మందిలో ముగ్గురు నిద్ర లేమితో బాధపడుతున్నట్లు అధ్యయనం తేల్చింది. సమస్యను తొలి దశలోనే గుర్తించి.. చికిత్స తీసుకుంటే నివారించొచ్చునని అధ్యయనంలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని