logo

పరిగి, కొడంగల్‌ బీఎస్పీ అభ్యర్థులు వీరే..

పరిగి శాసనసభా నియోజకవర్గం నుంచి బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)  అభ్యర్థిత్వం ఖరారైంది. పూడూరు మండలం మంచన్‌పల్లి గ్రామానికి చెందిన ఎన్కేపల్లి ఆనంద్‌ పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సోమవారం ప్రకటించారు.

Published : 31 Oct 2023 02:50 IST

ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌తో ఎన్కేపల్లి ఆనంద్‌

పరిగి, న్యూస్‌టుడే: పరిగి శాసనసభా నియోజకవర్గం నుంచి బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)  అభ్యర్థిత్వం ఖరారైంది. పూడూరు మండలం మంచన్‌పల్లి గ్రామానికి చెందిన ఎన్కేపల్లి ఆనంద్‌ పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సోమవారం ప్రకటించారు. ఆనంద్‌ డిగ్రీ, బీఎడ్‌ చేశారు. వయస్సు- 35, మాదిగ ఇండస్ట్రియల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

కె.నర్మద

కొడంగల్‌, న్యూస్‌టుడే: కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా కె.నర్మద పేరును సోమవారం అధికారికంగా ప్రకటించారు. మండలంలోని అంగడిరైచూర్‌ ఆమె స్వగ్రామం. భర్త పేరు కిష్టప్ప. ప్రైవేట్‌ ఉద్యోగి. ఇరువురు సంతానం. తెలంగాణ ఐకాస మహిళా ఛైర్మన్‌గా కొంతకాలం పాటు పనిచేశారు. బీఏ బీఈఎడ్‌ చేశారు. తెలంగాణ జనసమితి పార్టీ నుంచి నియోజకవర్గ ఇంఛార్జిగా వ్యవహరించారు. 2021 అక్టోబరు 12న బీఎస్పీలో చేరారు.

ఇప్పటికే వికారాబాద్‌ బీఎస్పీ అభ్యర్థిగా క్రాంతికుమార్‌, తాండూరుకు చంద్రశేఖర్‌ ముదిరాజ్‌ను పార్టీ ఖరారు చేసింది. తాజా ప్రకటనతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని