icon icon icon
icon icon icon

మొదటి నుంచి మలక్‌పేట జనరల్‌ స్థానమే

1952లో హైదరాబాద్‌ శాసనసభ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో నియోజకవర్గాలకు సంఖ్యలు ఉండేవి. చాదర్‌ఘాట్‌కు 2, మలక్‌పేటకు 8 సంఖ్య కేటాయించారు.

Updated : 10 Nov 2023 11:20 IST

1952లో హైదరాబాద్‌ శాసనసభ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో నియోజకవర్గాలకు సంఖ్యలు ఉండేవి. చాదర్‌ఘాట్‌కు 2, మలక్‌పేటకు 8 సంఖ్య కేటాయించారు. 1957లో తెలంగాణ.. ఆంధ్రలో విలీనమైంది. 1962 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014, 2018లో ఎన్నికలు నిర్వహించారు. అయితే 1952 నుంచి ఇప్పటివరకు మలక్‌పేట నియోజకవర్గం జనరల్‌ స్థానంగానే ఉంది. కానీ నియోజకవర్గ సంఖ్యలో మార్పులు చోటు చేసుకున్నాయి. 1957లో 17, 1962, 1967ల్లో 214, 1972లో 211, 1978 నుంచి 2004 వరకు 212గా ఉంది. 2009 నుంచి 2023 వరకు 58గా ఉంది.

న్యూస్‌టుడే, సైదాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img