logo

pneumonia: చలితో చంటి పిల్లల్లో న్యుమోనియా

చలి గాలులు, చల్లని వాతావరణంతో చంటి పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులతోపాటు ఆస్తమా, న్యుమోనియా కేసులు నమోదవుతున్నాయి.  పిల్లల ఆసుపత్రి నిలోఫర్‌లో ఇప్పటికే 50 మంది వరకు  చేరారు. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో చికిత్స కోసం ఎక్కువ మంది వస్తున్నారు.

Updated : 11 Dec 2023 08:49 IST

నిలోఫర్‌లో 50 మంది వరకు చేరిక

 

ఈనాడు, హైదరాబాద్‌: చలి గాలులు, చల్లని వాతావరణంతో చంటి పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులతోపాటు ఆస్తమా, న్యుమోనియా(pneumonia) కేసులు నమోదవుతున్నాయి.  పిల్లల ఆసుపత్రి నిలోఫర్‌లో ఇప్పటికే 50 మంది వరకు  చేరారు. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో చికిత్స కోసం ఎక్కువ మంది వస్తున్నారు. కొందరికి 5-6 రోజుల నుంచి జ్వరం తగ్గక పోవడం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే న్యుమోనియా కింద గుర్తించి ఆసుపత్రిలో చేర్చుకొంటున్నారు. బరువు తక్కువ, నెలల నిండకుండా పుట్టిన పిల్లల్లో ఈ సీజన్‌లో హైపోథెర్మియా(ఒళ్లు చల్లబడిపోవడం) సమస్య కన్పిస్తుంది.  న్యుమోనియా లక్షణాలు కనిపించగానే సొంతంగా యాంటిబయోటిక్స్‌ వాడవద్దని వైద్యులు సూచిస్తున్నారు.


 కంగారూ మదర్‌ కేర్‌ పిల్లలకు కీలకం..

ఈ సీజన్‌లో చంటి పిల్లలు ఎక్కువగా న్యుమోనియా బారిన పడుతుంటారు. వారి చుట్టూ వెచ్చని వాతావరణం ఉండేలా చూడండి. తలుపులు, కిటికీలు తెరిచిపెట్టడం, బయట వాతావరణంలో తిప్పడం వల్ల  న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఉంది. దీంతో  జ్వరం, దగ్గు, డొక్కలు ఎగరేయడం, ఎక్కువసార్లు ఊపిరి తీసుకుంటారు. ముఖ్యంగా చంటి పిల్లలను చల్లని వాతావరణం నుంచి కాపాడాలంటే కంగారూ మదర్‌ కేర్‌ కీలకం. అంటే కంగారు జంతువు తన పిల్లలను కడుపులోని సంచిలో పెట్టుకున్నట్లుగా తల్లి కూడా తన బిడ్డను ఛాతీపై పడుకోబెట్టుకొని ఉంచడం వల్ల తల్లి శరీర ఉష్ణోగ్రతలు చిన్నారిని కాపాడతాయి. తల్లిపాలు కూడా సక్రమంగా అందుతాయి. దీంతో బిడ్డ బరువు పెరిగి ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం కంగారూ మదర్‌కేర్‌లో ఉంచాలి.

 -డాక్టర్‌ ఉషారాణి, సూపరింటెండెంట్‌, నిలోఫర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని