logo

అనుమతి లేని ఆసుపత్రుల మూసివేత

మేడ్చల్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం చిలుకానగర్‌లో ఆకస్మిక తనిఖీలు చేసి అనుమతి లేని వైద్యశాలలను సీజ్‌ చేశారు.

Published : 28 Mar 2024 03:12 IST

చిలుకానగర్‌లో ప్రైవేటు ఆసుపత్రిని సీజ్‌ చేస్తున్న వైద్యాధికారులు

హబ్సిగూడ, న్యూస్‌టుడే: మేడ్చల్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం చిలుకానగర్‌లో ఆకస్మిక తనిఖీలు చేసి అనుమతి లేని వైద్యశాలలను సీజ్‌ చేశారు. వాటిలో ఉప్పల్‌లోని శ్రీమణికంఠ హెల్త్‌ కేర్‌ అండ్‌ పాలీ క్లినిక్‌, చిలుకా నగర్‌లోని రాజు ఫస్ట్‌ ఎయిడ్‌ క్లినిక్‌లను సీజ్‌ చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారి డా.రఘునాధస్వామి, డిప్యూటీ జిల్లా అధికారి నారాయణరావు తెలిపారు. అర్హత కలిగిన వైద్యులు లేరని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. అనుమతి లేని ఆసుపత్రులను నడిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దస్తావేజులు లేని మహాలక్ష్మి క్లినిక్‌ (చిలుకానగర్‌)కు నోటీసులను జారీ చేశారు. తనిఖీల్లో ఉప్పల్‌ వైద్యురాలు డా.సౌందర్యలత పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని