logo

చేయి లేకున్నా.. సైకిల్‌ యాత్ర

ఈ చిత్రంలో కనిపిస్తున్న సైక్లిస్టు తమిళనాడుకు చెందిన బి.తమీమ్‌ అన్సారీ. 2003లో తాను పనిచేసే కర్మాగారంలో ప్రమాదవశాత్తూ కుడి చేతిని కోల్పోయారు. ఆ సమయంలో చికిత్సకు ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు తోడవటంతో ప్రమాద బీమా వంటివి లేక ఆవస్థలు పడ్డారు.

Updated : 29 Mar 2024 04:38 IST

ఈ చిత్రంలో కనిపిస్తున్న సైక్లిస్టు తమిళనాడుకు చెందిన బి.తమీమ్‌ అన్సారీ. 2003లో తాను పనిచేసే కర్మాగారంలో ప్రమాదవశాత్తూ కుడి చేతిని కోల్పోయారు. ఆ సమయంలో చికిత్సకు ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు తోడవటంతో ప్రమాద బీమా వంటివి లేక ఆవస్థలు పడ్డారు. దాంతో ప్రమాద బీమా ఆవశ్యకతపై ఆవగాహన కల్పించేందుకు పలు దఫాలుగా సైకిల్‌ యాత్ర చేపట్టి ఇప్పటి వరకు 40వేల కిలోమీటర్లు పూర్తి చేశారు. తాజాగా  ఓ ఇన్స్యూరెన్స్‌ సంస్థ ఆర్థిక సహకారంలో ఈనెల 8వ తేదీన కాశ్మీర్‌లో మరో యాత్ర ప్రారంభించారు. జమ్మూ, డిల్లీ, ఆగ్రా, నాగ్‌పూర్‌ మీదుగా 2,500 కిలోమీటర్లు ప్రయాణించి గురువారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇక్కడి నుంచి బెంగళూరు, మధురై మీదుగా కన్యాకుమారి చేరుకొని యాత్ర ముగిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని