logo

జీవన విలువలు చూపే దర్పణం రామాయణం

మానవ జీవన విలువలను చూపే దర్పణం రామాయణమని ఆధ్వాత్మికవేత్త చినజీయర్‌ స్వామి అన్నారు.

Published : 30 Mar 2024 02:18 IST

కళాకారులతో చినజీయర్‌స్వామి, అహోబిల స్వామి, ఆనందశంకర్‌జయంత్‌, సుచిత్ర ఎల్ల, చిత్రవిశ్వేశ్వరన్‌

మాదాపూర్‌, న్యూస్‌టుడే: మానవ జీవన విలువలను చూపే దర్పణం రామాయణమని ఆధ్వాత్మికవేత్త చినజీయర్‌ స్వామి అన్నారు. జీవితానికి ఉపయుక్తమైన ఎన్నో అంశాలను రామాయణం నేర్పుతుందని చెప్పారు. శుక్రవారం సాయంత్రం మాదాపూర్‌లోని సీసీఆర్‌టీలో ‘‘రామాయణ కల్పవృక్షం’’ పేరిట ఏర్పాటుచేసిన సంగీత, నృత్యమహోత్సవాన్ని చినజీయర్‌స్వామి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నిజమైన మావన జీవితాన్ని తెలుసుకోవాలంటే రాముడి గురించి తెలుసుకోవాలన్నారు.  భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్ల మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, కళలు ఎంతో అద్భుతమని, వాటిని భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని చెప్పారు. శాస్త్రీయ నృత్యకారిణి ఆనందశంకర్‌జయంత్‌ బృందం నృత్యరూపకం నయనానందకరంగా సాగింది. కార్యక్రమానికి అహోబిల జీయర్‌స్వామి, నాట్యకారిణి చిత్ర విశ్వేశ్వరన్‌ హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని