logo

ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్‌

ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్‌ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్‌లోని కలెక్టర్‌ కార్యాలయంలో వీడీడీఎఫ్‌ ఆధ్వర్యంలో అష్ఫక్‌ను సన్మానించారు.

Published : 20 Apr 2024 03:18 IST


సివిల్స్‌ ర్యాంకర్‌ అష్ఫక్‌ను సన్మానిస్తున్న నారాయణరెడ్డి, శుభప్రద్‌ పటేల్‌ తదితరులు

వికారాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే: ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్‌ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్‌లోని కలెక్టర్‌ కార్యాలయంలో వీడీడీఎఫ్‌ ఆధ్వర్యంలో అష్ఫక్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మట్టిలో మాణిక్యాలు ఉంటాయనడానికి గ్రామీణ ప్రాంత విద్యార్థులు సివిల్స్‌లో ర్యాంకులు సాధించడమే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు శుభప్రద్‌ పటేల్‌, శ్రీనివాస్‌లు మాట్లాడుతూ...ఒకప్పుడు జిల్లా వాసికి ఉస్మానియా వర్సిటీలో సీటు వస్తేనే సంబురాలు చేసుకునేవారమని, ప్రస్తుతం సివిల్స్‌లో రాణిస్తున్నారని ఇది భావితరాలకు స్ఫూర్తిని నింపి ముందుకు నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వీడీడీఎఫ్‌ ప్రతినిధులు మారుతి, తిరుపతిరెడ్డి, ఫక్రుద్దీన్‌, మాణిక్‌ రెడ్డి, కేథార్‌నాథ్‌, విజేత తల్లిదండ్రులు జాఫర్‌, రిజ్వానా బేగం తదితరులు పాల్గొన్నారు

ప్రతి గ్రామ సమస్యలపై నివేదిక  

వికారాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా ప్రతి గ్రామాన్ని పర్యవేక్షించి, ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సమావేశాలు ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలో ఉన్న గ్రామాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, తాగునీరు, పరిశుభ్రత, విద్యుత్‌, వీధి దీపాలు, హరితహారం తదితర సమస్యలపై సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధిహామీ పనుల్లో కూలీల హాజరు తక్కువగా ఉన్న గ్రామాల అధికారులు దృష్టి సారించి కూలీల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ శ్రీనివాస్‌, డీపీఓ జయసుధ, ఎంపీడీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని