CBI court: 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్‌ కేసులో తీర్పు

11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్‌ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది.

Published : 30 Apr 2024 20:04 IST

హైదరాబాద్‌: 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్‌ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. ఏపీ సీఎం జగన్‌ సన్నిహితుడు ఎన్‌.సునీల్‌రెడ్డి, కోనేరు ప్రదీప్‌, విజయరాఘవ, శ్రీకాంత్‌ జోషిల డిశ్చార్జి పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఎమ్మార్‌ హిల్స్‌, బౌల్డర్‌ హిల్స్‌ డిశ్చార్జి పిటిషన్లనూ తోసిపుచ్చింది. విశ్రాంత ఐఏఎస్‌ బీపీ ఆచార్యపై ఐపీసీ 120(బి), 409 సెక్షన్లను తొలగించింది. బీపీ ఆచార్య అవినీతి నిరోధక చట్టం అభియోగాలను ఎదుర్కోవాల్సిందేనని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. వైకాపా నేత కోనేరు రాజేంద్రప్రసాద్‌ మరణించడంతో విచారణను ముగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని