logo

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్‌

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు.

Published : 05 May 2024 03:29 IST

పరిగిలో పోస్టల్‌ బ్యాలెట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఉమాహారతి

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి: ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానాన్ని, పక్కనే ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓపీఓల శిక్షణను జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ, శిక్షణ కలెక్టర్‌ ఉమా హారతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపీఓల నుద్దేశించి మాట్లాడుతూ చేవెళ్ల లోక్‌సభ నియోజక వర్గంలో 43 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని పోలింగ్‌ బూత్‌కు 3 బ్యాలెట్‌ యూనిట్లను కేటాయిస్తారని తెలిపారు. సామగ్రిని తీసుకు వెళ్లడం నుంచి పోలింగ్‌ పూర్తి చేసి సామగ్రి అప్పగించే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం మేరీ-ఎ-నాట్స్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంను సందర్శించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ నోడల్‌ అధికారి శ్రీనివాస్‌రావు, మాస్టర్‌ ట్రైనీ వీరకాంతం, పోస్టల్‌ నోడల్‌ అధికారిణి సాజిదాబేగం, తహసీల్దారు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.  

ఇబ్బందులు రాకుండా చూసుకోండి: ఎన్నికల  సిబ్బంది, అధికారులు సమష్టిగా పనిచేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. శనివారం అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఉమాహారతితో కలిసి పరిగిలోని పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి జరుగుతున్న శిక్షణలో పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. సందేహాలను ఉన్నతాధికారులను సంప్రదించి తీర్చుకోవాలన్నారు. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి వాసుచంద్ర, వివిధ మండలాల తహసీల్దార్లు ఆనంద్‌రావు, తిరుపతయ్య, రమాదేవి, ప్రవలింగం, మురళి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని