logo

ప్రజాశ్రేయస్సే అధికారులకు పరమావధి కావాలి

సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రజాశ్రేయస్సు, దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.

Published : 05 May 2024 03:48 IST

సత్కారం పొందిన యూపీఎస్సీ ర్యాంకర్లతో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. చిత్రంలో కృష్ణప్రదీప్‌, పద్మనాభరావు తదితరులు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రజాశ్రేయస్సు, దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో శనివారం కృష్ణప్రదీప్‌ ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ అకాడమీ ఆధ్వర్యంలో యూపీఎస్సీ 2023-24 పరీక్షల్లో విజయం సాధించిన 35 మంది ర్యాంకర్లను అభినందిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన   మాట్లాడారు. సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు ప్రభుత్వానికి కళ్లూచెవుల్లాంటి వారని, అత్యంత నిజాయతీగా విధులు నిర్వర్తించాలని సూచించారు. యుక్త వయసు నుంచే తాను అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడానని గుర్తుచేసుకున్నారు. దూరదర్శన్‌్ మాజీ అదనపు డీజీ డాక్టర్‌ ఎ.పద్మనాభరావు మాట్లాడుతూ యూపీఎస్సీ పరీక్షల్లో మూడు దశలు వేటికవే ప్రత్యేకమన్నారు. వాటిని నెగ్గుకొచ్చిన వారందరినీ ఆయన అభినందించారు. అకాడమీ నిర్వాహకులు కృష్ణప్రసాద్‌ చీఫ్‌ మెంటర్‌ డాక్టర్‌ భవానీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని