logo

సీజ్‌ చేసిన నగదులో రూ.4.27 కోట్లు విడుదల

ఎన్నికల నేపథ్యంలో ఆధారాల్లేకుండా రూ.50 వేలకు మించి నగదు తరలిస్తున్న ఘటనలపై 153 కేసులు నమోదు కాగా రూ.5,61,02,455 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు స్వాధీనం చేసుకొని జిల్లా గ్రీవెన్స్‌ కమిటీ (డీజీసీ)కి సిఫార్సు చేశాయి.

Published : 06 May 2024 03:48 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఎన్నికల నేపథ్యంలో ఆధారాల్లేకుండా రూ.50 వేలకు మించి నగదు తరలిస్తున్న ఘటనలపై 153 కేసులు నమోదు కాగా రూ.5,61,02,455 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు స్వాధీనం చేసుకొని జిల్లా గ్రీవెన్స్‌ కమిటీ (డీజీసీ)కి సిఫార్సు చేశాయి. వీటిలో 146 కేసుల్లో ఆధారాలు సమర్పించడంతో రూ.4,27,98,455 డీజీసీ ద్వారా విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ ఆదివారం తెలిపారు. ఈ కేసులకు సంబంధించి సందేహాలు ఉన్నట్లయితే డీజీసీ ఛైర్మన్‌ సరోజ ఫోన్‌ 9618888110ను, కమిటీ కన్వీనర్‌ శరత్‌చంద్ర ఫోన్‌ 9177872240ను సంప్రదించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని