logo

మోదీ పాలనకు చరమగీతం పాడాలి

కేంద్రంలో ప్రధాని మోదీ నిరంకుశ పాలనకు ఈ పార్లమెంటు ఎన్నికల్లో చరమగీతం పాడాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Published : 06 May 2024 03:50 IST

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు

ఇబ్రహీంపట్నం, యాచారం, న్యూస్‌టుడే: కేంద్రంలో ప్రధాని మోదీ నిరంకుశ పాలనకు ఈ పార్లమెంటు ఎన్నికల్లో చరమగీతం పాడాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం ఇబ్రహీంపట్నం సీపీఎం కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. పదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల విభజన హామీలను మోదీ పూర్తిగా విస్మరించారని.. రాష్ట్రాల హక్కులను హరించారని మండిపడ్డారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రైవేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన భాజపా.. పదేళ్లుగా అధికారంలో ఉన్నా వర్గీకరణ చేయకుండా దళితులను మోసం చేసిందన్నారు. భారాస పాలనలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పెద్ద్ద ఎత్తున అవినీతి జరిగినా.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారాస, భాజపా అభ్యర్థులను ఈ ఎన్నికల్లో ఓడించాలన్నారు. నిరంతరం పేదల పక్షాన పోరాడే సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ను భువనగిరి ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కు పంపాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు జంగారెడ్డి, జిల్లా కార్యదర్శి కడియాల భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

పేదల వాణి పార్లమెంట్‌లో వినిపించే వారిని ఎన్నుకోవాలని.. రాఘవులు ఓటర్లకు పిలుపునిచ్చారు. యాచారం మండలం మాల్‌లో ప్రచారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని