logo

కాంగ్రెస్‌ హామీలకు గ్యారంటీ ఎవరు?

లోక్‌సభ ఎన్నికల్లో డీకే అరుణ ఇస్తున్న హామీలకు ప్రధాని మోదీ గ్యారంటీ ఉన్నారని, మరి కాంగ్రెస్‌ ఇచ్చే హామీలకు ఎవరు గ్యారంటీ అని మాజీ మంత్రి, భాజపా జాతీయ కౌన్సిల్‌ సభ్యులు మర్రి శశిథర్‌రెడ్డి అన్నారు.

Updated : 06 May 2024 05:46 IST

మాట్లాడుతున్న  మర్రి శశిధర్‌ రెడ్డి

వికారాబాద్‌ టౌన్‌, కొడంగల్‌: లోక్‌సభ ఎన్నికల్లో డీకే అరుణ ఇస్తున్న హామీలకు ప్రధాని మోదీ గ్యారంటీ ఉన్నారని, మరి కాంగ్రెస్‌ ఇచ్చే హామీలకు ఎవరు గ్యారంటీ అని మాజీ మంత్రి, భాజపా జాతీయ కౌన్సిల్‌ సభ్యులు మర్రి శశిథర్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం కొడంగల్‌ వచ్చిన ఆయన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పున్నంచంద్‌ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఉండటంతో అధికార దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. డీకే అరుణపై సీఎం రేవంత్‌ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాజవర్థన్‌రెడ్డి, నాగులపల్లి ప్రతాప్‌రెడ్డి, బస్వరాజ్‌, సర్వేష్‌ పాల్గొన్నారు.

12 నుంచి 15 ఎంపీ సీట్లు గెలవడం ఖాయం

తెలంగాణలో భాజపా 12 నుంచి 15 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని పార్టీ రాష్ట్ర నాయకుల మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం వికారాబాద్‌లోని రామయ్యగూడ ఎంఐజీ కాలనీలో జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి నివాసంలో జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా పట్టణ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, విశ్వజిత్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు శివరాజ్‌, విజయభాస్కర్‌రెడ్డి, పాండుగౌడ్‌, కేపీరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని