logo

400..సీట్లు కాదు.. పెట్రోల్‌ ధర

అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

Updated : 06 May 2024 05:39 IST

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

కర్మన్‌ఘాట్ చౌరస్తాలో గదతో మాజీ మంత్రి కేటీఆర్‌. చిత్రంలో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

రాంనగర్‌, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ఆ పార్టీ సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు మద్దతుగా ఆదివారం రాత్రి ముషీరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని రాంనగర్‌ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. భాజపా నాయకులు ‘అబ్‌ కీ బార్‌ చార్‌ సౌ’ అంటున్నారు.. అంటే మళ్లీ మోదీని ప్రధానిని చేస్తే పెట్రోల్‌ ధర రూ.400 చేస్తారని ఎద్దేవా చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని గొప్పలు చెప్పిన నరేంద్ర మోదీ.. పదేళ్ల వ్యవధిలో రూ.20 కోట్ల కొలువులిచ్చారా? అని ప్రశ్నించారు. జై శ్రీరాం అంటూ దేవుడిని అడ్డం పెట్టుకొని మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో పద్మారావుగౌడ్‌ ప్రజలకు బియ్యం సహా నిత్యావసర సరకులు అందిస్తే.. కిషన్‌రెడ్డి మాత్రం కురుకురే ప్యాకెట్లు పంపిణీ చేశారని ఎద్దేవా చేశారు. పద్మారావుగౌడ్‌ గల్లీ నుంచి వచ్చారని.. మీరు ఆశీర్వదిస్తే ఎంపీగా గెలిచి దిల్లీకి పోతారని, ఈ దఫా కారు గుర్తు ఓటేసి అత్యధిక మెజార్టీతో ఆయన్ను గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, మాజీ ఎమ్మెల్సీ సలీం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని