logo

ప్రభుత్వ వ్యతిరేకతను దారి మళ్లించేందుకు వివాదం : తెదేపా

వైయస్‌ఆర్‌ పేరు మార్చి కడప జిల్లాగా ప్రకటించకుంటే అమలాపురంలో జరిగిన ఘటనే ఇక్కడా పునరావృతమవుతుందని తెదేపా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు. తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కడప జిల్లాగా

Published : 27 May 2022 06:07 IST

మాట్లాడుతున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, నాయకులు

అమీర్‌బాబు, గోవర్ధన్‌రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వికాస్‌హరికృష్ణ

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే :వైయస్‌ఆర్‌ పేరు మార్చి కడప జిల్లాగా ప్రకటించకుంటే అమలాపురంలో జరిగిన ఘటనే ఇక్కడా పునరావృతమవుతుందని తెదేపా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు. తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కడప జిల్లాగా ఉన్న పేరును వైయస్‌ఆర్‌ జిల్లాగా మార్పు చేసే హక్కెవరిచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జిల్లా పేరును మార్పు చేయాలని డిమాండు చేశారు. ప్రభుత్వంపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దారిమళ్లించేందుకు వైకాపా నేతలు అంబేడ్కర్‌ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. గత ఎన్నికల ముందు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును తెరమీదకు తెచ్చి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు మళ్లీ అంబేడ్కర్‌ పేరును వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ వందేళ్ల జయంతి చేస్తుంటే అక్కడా రాజకీయం చేస్తూ, బస్సులు తిరగకుండా చేస్తుండటం దుర్మార్గమన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కడప జిల్లా పేరును యథావిధిగా ఉంచాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్‌ హరికృష్ణ, నాయకులు జయకుమార్‌, మాసాకోదండరాం, గుర్రప్ప, రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, తెలుగుయువత అధికార ప్రతినిధి శివరాం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని