logo
Published : 01/12/2021 03:46 IST

ట్రాఫిక్‌ ఇక్కట్లు తీరేదెన్నడో..!

మెట్‌పల్లి, న్యూస్‌టుడే

మెట్పల్లిలో ఏర్పాటు చేసిన సిగ్నల్‌

మెట్పల్లి, కోరుట్ల పట్టణాలు డివిజన్‌ కేంద్రాలుగా మారినప్పటి నుంచి పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే ప్రజల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాల సంఖ్య వేలకు మించింది. దీనికితోడు నిజామాబాద్‌, నిర్మల్‌, సిరిసిల్ల జిల్లాల సరిహద్దు గ్రామాల నుంచి వివిధ అవసరాల నిమిత్తం రెండు పట్టణాలకు వచ్చిపోయే ప్రజలు ఎక్కువే. కరోనా వచ్చినప్పటి నుంచి సొంత వాహనాల వినియోగం మరింతగా పెరిగింది. 63వ జాతీయ రహదారి రెండు పట్టణాల మధ్య నుంచి వెలుతుండడంతో ట్రాఫిక్‌ ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. వాహనదారులు, పాదచారులు ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలుచోట్ల మిషన్‌ భగీరథ పైపులైన్‌, రోడ్డువిస్తరణ పనులు నత్తనడక సాగుతుండడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయని పలువురు అంటున్నారు.

బ్యాటరీలు అమర్చడంలో జాప్యం
పట్టణ సుందరీకరణలో భాగంగా ట్రాఫిక్‌ సిగ్నళ్ల కోసం రెండు పట్టణాల్లో రూ.25 లక్షల వంతున రూ.50 లక్షలు కేటాయించారు. రోడ్లు భవనాల శాఖ, పురపాలక అధికారులతో కలిసి మెట్పల్లిలో శాస్త్రి, రాజీవ్‌ చౌరస్తా, కోరుట్లలో నంది చౌరస్తా, కొత్త బస్టాండ్‌ సమీపంలో ఆటోమిక్‌ సిగ్నల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి కంట్రోల్‌ ప్యానల్‌, సోలార్‌ ప్యానల్‌, లైట్లు అమర్చారు. కాగా సిగ్నళ్లు వెలగడానికి అవసరమైన బ్యాటరీలు అమర్చడంలో జాప్యం చోటుచేసుకుంటోంది. రెండు పట్టణాల్లో రెండు ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన బ్లింకర్స్‌ మాత్రమే పనిచేస్తున్నాయి. నెలలు గడుస్తున్నా సిగ్నళ్లను వినియోగంలోకి తీసుకురావడవంలో జాప్యం వల్ల ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు ఇష్టానుసారంగా రోడ్లపై వెళుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని రెండు పట్టణాల ప్రజలు కోరుతున్నారు.

మిగతా కూడళ్ల సంగతేంటి..
రెండు పట్టణాల్లో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ సిగ్నళ్లను ఏర్పాటు చేయడంపట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న మిగతా కూడళ్ల సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మెట్పల్లి పట్టణంలో పాత పెట్రోల్‌ పంపు, కోరుట్ల పట్టణంలో కార్గిల్‌ చౌరస్తాలో సిగ్నల్‌ వ్యవస్థ ఏర్పాటు చేయలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత
వేణు, ఏఈ, రోడ్లు భవనాలశాఖ
సిగ్నళ్ల వ్యవస్థ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. బ్యాటరీలు అమర్చడంలో జాప్యం జరుగుతోంది. బ్యాటరీలు ఇతర దేశం నుంచి తెప్పించాల్సి ఉంది. ప్యానల్‌ సిస్టం ఏర్పాటు చేశాం. బ్యాటరీలు అమర్చి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత వినియోగంలోకి తెస్తాం.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని