Ramagundam Fertilizers: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉత్పత్తి ఆపేయండి: పీసీబీ

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉత్పత్తి నిలిపేయాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)

Updated : 29 May 2022 10:35 IST

రామగుండం: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉత్పత్తి నిలిపేయాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల పాటు కర్మాగారంలో పీసీబీ తనిఖీలు చేపట్టింది. ఏడాది కాలంగా ఇక్కడ ఉత్పత్తి జరుగుతోంది. అధికారికంగా ఈ నెల 26న ప్రధాని మోదీ దీన్ని ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. ఈ పరిశ్రమపై కొంత కాలంగా అనేక ఫిర్యాదులొచ్చాయి. గ్యాస్ లీకేజీ తదితర అంశాలపై పలుసార్లు స్థానికులు ఆందోళనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే స్పందించి ఫిర్యాదు చేయడంతో కర్మాగారంలో పీసీబీ తనిఖీలు నిర్వహించింది. 

ఈ సందర్భంగా 12 లోటుపాట్లు ఉన్నట్లు గమనించి కర్మాగార అధికారులకు సమాచారం ఇచ్చారు. లోపాలను సరి చేసే వరకు కర్మాగారాన్ని మూసేయాలని సూచించారు. ప్రమాదాలు అధికంగా జరిగే ఆస్కారం ఉన్న కర్మాగారం అయినా.. సిబ్బంది, స్థానిక ప్రజలకు సంబంధించి భద్రతా చర్యలు తీసుకోలేదని పీసీబీ వివరించింది. మరోవైపు తనిఖీల్లో భాగంగా పీసీబీ అధికారులు రూ.12లక్షల గ్యారెంటీ సొమ్ము జప్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని