logo

ఆరో రోజు 17 నామినేషన్లు

లోక్‌సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్‌సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్‌ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది.

Published : 25 Apr 2024 04:29 IST

నామపత్రాల దాఖలుకు నేటితో ముగియనున్న గడువు

ఈనాడు, కరీంనగర్‌ : లోక్‌సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్‌సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్‌ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల తరఫున టికెట్‌ పొందిన వారితోపాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరపున అభ్యర్థులు నామపత్రాలను అందించారు. ఈసారి కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ స్థానాల్లో స్వతంత్రులు అధికంగానే పోటీపై ఆసక్తి కనబర్చారు. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన కార్యక్రమం ఉంటుంది.

కరీంనగర్‌లో 9.. పెద్దపల్లిలో 8

పెద్దపల్లిలో భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ గురువారం రెండు సెట్ల నామినేషన్‌ వేశారు. పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున ఇరుగురాల భాగ్యలక్ష్మి, స్వతంత్ర అభ్యర్థులుగా నీరటి శంకర్‌, కుర్మ మహేందర్‌, మోటం రవీందర్‌, బూడిద తిరుపతి, కాశీ సతీశ్‌కుమార్‌, చందనగిరి శ్రీనివాస్‌లు రిటర్నింగ్‌ అధికారి ముజమ్మిల్‌ఖాన్‌కు నామపత్రాలు అందజేశారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ తరపున అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నామినేషన్‌ పత్రాలను ఆయన అనుచరులు రిటర్నింగ్‌ అధికారి పమేలా సత్పతికి అందించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ తరఫున నామినేషన్‌ వేసిన వెలిచాల రాజేందర్‌రావు సతీమణి వెలిచాల రేఖ కూడా కాంగ్రెస్‌ అభ్యర్థిగా బుధవారం నామపత్రాలను సమర్పించారు. స్వతంత్ర అభ్యర్థులుగా జంగా అపర్ణ, గద్ద సతీశ్‌, శివరాత్రి శ్రీనివాస్‌, వేముల విక్రంరెడ్డి, గౌరిశెట్టి సురేశ్‌, బరిగె గట్టయ్య యాదవ్‌, తెలుగు కాంగ్రెస్‌ పార్టీ తరఫున చీకోటి వరుణ్‌కుమార్‌ గుప్తా నామినేషన్‌ వేశారు.

ఇప్పటి వరకు నామ పత్రాలు అందించిన అభ్యర్థులు

కరీంనగర్‌ 35

పెద్దపల్లి 41

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని