logo

ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలి

పోలింగ్‌ రోజున దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక  ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మోడల్‌ పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, దివ్యాంగులకు చేపట్టాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్‌లో మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

Published : 05 May 2024 04:51 IST

‘ఓట్‌ ఫర్‌ ష్యూర్‌’ మెహందీ చూపుతున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పోలింగ్‌ రోజున దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక  ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మోడల్‌ పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, దివ్యాంగులకు చేపట్టాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్‌లో మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. 

అవగాహన కల్పించండి

కరీంనగర్‌ సంక్షేమ విభాగం: మండల సమాఖ్య సభ్యురాళ్లు గ్రామాల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించి ఓటింగ్‌ శాతం పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. శనివారం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కార్యాలయంలోని స్వశక్తి కళాశాలలో జిల్లా సమాఖ్య సభ్యురాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతరం ట్రాన్స్‌జెండర్లకు ఓటుహక్కుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఓ ట్రాన్స్‌జెండర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి చేతిపై స్వీప్‌, ఓట్‌ ఫర్‌ షూర్‌ అని రాయగా.. మెహందీని చూపుతూ కలెక్టర్‌ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్‌, శిక్షణా కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌ పాల్గొన్నారు.
హుజూరాబాద్‌ గ్రామీణం: ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. జూపాకలో హోం ఓటింగ్‌లో భాగంగా వృద్ధ అంధురాలు కనకలక్ష్మితో మాట్లాడారు.  ఎన్నికల సంఘం ఇంటి వద్ద ఓటు అనే పద్ధతిని ప్రవేశపెట్టిందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని