logo

అగ్నిగుండం

ఈ వేసవి సీజన్‌లో తొలిసారిగా ఆదివారం జగిత్యాల జిల్లాలోని వెల్గటూరులో 47.1 డిగ్రీల సెల్సియస్‌ రాష్ట్ర స్థాయి అత్యధిక గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత నమోదైంది.

Published : 06 May 2024 06:13 IST

47.1 డిగ్రీలకు చేరిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు

జగిత్యాల ధరూర్‌క్యాంపు, న్యూస్‌టుడే: ఈ వేసవి సీజన్‌లో తొలిసారిగా ఆదివారం జగిత్యాల జిల్లాలోని వెల్గటూరులో 47.1 డిగ్రీల సెల్సియస్‌ రాష్ట్ర స్థాయి అత్యధిక గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోధూరులో 46.8, రాయికల్‌ మండలం అల్లీపూర్‌ 46.7, కరీంనగర్‌ జిల్లా వీణవంక 46.7, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం సుగ్లంపల్లి 45.6, సిరిసిల్లలో 44.7 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదుకావటం, వడగాలులతో ప్రజలు సతమతమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని