logo

జిల్లాల పునర్విభజన నిర్ణయాన్ని మానుకోవాలి

జిల్లాల పునర్విభజన నిర్ణయాన్ని ప్రభుత్వం మానుకోవాలని జిల్లా పరిరక్షణ కమిటీ నాయకుడు బొల్లి రామ్మోహన్‌ కోరారు.

Published : 06 May 2024 06:19 IST

సమావేశంలో పాల్గొన్న జిల్లా పరిరక్షణ కమిటీ నాయకులు  రామ్మోహన్‌, రమాకాంతారావు, బుస్స వేణు తదితరులు

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాల పునర్విభజన నిర్ణయాన్ని ప్రభుత్వం మానుకోవాలని జిల్లా పరిరక్షణ కమిటీ నాయకుడు బొల్లి రామ్మోహన్‌ కోరారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసిందన్నారు. ఫలితంగా జిల్లా స్థాయి అధికారులందరూ జిల్లా కేంద్రంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సామాన్యుడు ఏ సమస్య ఉన్నా జిల్లా అధికారులను కలిసి వారి సమస్యలను పరిష్కరించుకుంటున్నారని తెలిపారు. జిల్లా రావడం వల్ల వైద్య, ఇంజినీరింగ్‌, వ్యవసాయ పాలిటెక్నిక్‌, నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను తీసి వేస్తామంటే ఎవరూ జీర్ణించుకోవడం లేదన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమాలు చేసి, వారిని అన్ని విధాలుగా ఒప్పించి సాధించుకున్న జిల్లా, దీన్ని ముఖ్యమంత్రి తొలగిస్తానంటే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాను తొలగించే నిర్ణయం మానుకోవాలని, లేదంటే జిల్లాలో కాంగ్రెస్‌ నాయకులను కాలు పెట్టనియ్యమని జిల్లా పరిరక్షణ కమిటీ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా పరిరక్షణ కమిటీ నాయకులు ఆవునూరి రమాకాంతారావు, బుస్స వేణు, ఎం.డి.సత్తార్‌, కంసాల మల్లేశం, గడ్డం లతా, వీరవేని మల్లేశ్‌ యాదవ్‌, దార్ల సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని