logo

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రసన్న వరాలే

కర్ణాటక ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బి.ప్రసన్న బి.వరాలే పేరును సర్వోన్నత న్యాయస్థానంలోని కొలీజియం సిఫార్సు చేసింది. ఆయన త్వరలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Updated : 01 Oct 2022 02:35 IST

జస్టిస్‌ ప్రసన్న వరాలే

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కర్ణాటక ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బి.ప్రసన్న బి.వరాలే పేరును సర్వోన్నత న్యాయస్థానంలోని కొలీజియం సిఫార్సు చేసింది. ఆయన త్వరలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీనియరు న్యాయవాది ఎస్‌.ఎన్‌.లోయా వద్ద 1985లో జస్టిస్‌ ప్రసన్న జూనియర్‌గా పని చేశారు. ఔరంగాబాద్‌లోని అంబేడ్కర్‌ న్యాయ కళాశాలలో ఆచార్యునిగా 1992లో సేవలు అందించారు. బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా 2008 జులై 18 బాధ్యతలు చేపట్టారు. కర్ణాటక ఉన్నత న్యాయస్థానంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ ఆరాధే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని