logo

రక్షకుడే భక్షకుడైతే..

పులిచర్మాన్ని విక్రయిస్తున్న రామాంజని అనే వ్యక్తిని అపహరించి రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండు చేసిన హరీశ్‌ అనే వ్యక్తిని బాగలూరు ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 24 Mar 2023 05:40 IST

 హెడ్‌ కానిస్టేబుల్‌ అరెస్టు
పరారీలో మారతహళ్లి ఎస్సై

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : పులిచర్మాన్ని విక్రయిస్తున్న రామాంజని అనే వ్యక్తిని అపహరించి రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండు చేసిన హరీశ్‌ అనే వ్యక్తిని బాగలూరు ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. ఆయన.. మారతహళ్లి ఠాణాలో హెడ్‌ కానిస్టేబుల్‌ అని తెలుసుకుని అవాక్కయ్యారు. రామాంజనిని అపహరించేందుకు సహకారాన్ని అందించి, పరారీలో ఉన్న మరో నిందితుడు మారతహళ్లి ఠాణా ఎస్సై రంగేశ్‌ అని తెలుసుకుని నోళ్లు వెళ్లబెట్టారు. పులిచర్మాన్ని విక్రయిస్తున్న యువకుడిని రంగేశ్‌, హరీశ్‌ మార్చి 19న అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేయకుండా- ఠాణాకు తీసుకువెళ్లకుండా వ్యక్తిగత రహస్య ప్రాంతానికి తరలించారు. ఒక ఇంట్లో బంధించి- రూ.40 లక్షలు ఇస్తేనే విడిచి పెడతామని బెదిరించారు. ఆ యువకుడు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి రూ.40 లక్షల కోసం విన్నవించాడు. ఆ కుటుంబ సభ్యులు భయపడి బాగలూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫోన్‌ నంబర్ల ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి.. హరీశ్‌ను అరెస్టు చేసి, బాధితుడ్ని క్షేమంగా విడిపించారు. ఇదే కేసుతో సంబంధమున్న శబ్బీర్‌, జాకీర్‌ అనే వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. రంగేశ్‌, ఇతర నిందితులు కేఎల్‌ మహదేవ నాయక్‌, మహేశ్‌లు అపహరణలో పాల్గొని పరారీలో ఉన్నారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు