logo

కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన

నవోదయ రీగెల్‌-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

Published : 29 Mar 2024 03:15 IST

జ్యోతిని వెలిగిస్తున్న ఉప కులపతి హనుమంతప్ప

రాయచూరు, న్యూస్‌టుడే : నవోదయ రీగెల్‌-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులను కేవలం చదువులకే పరిమితం చేయక, పాఠ్యేతర విషయాలపై ఆసక్తిని ప్రోత్సహించేందుకు ఏటా వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్ని విధాలా ఎదిగేందుకు విద్యా సంస్థ కల్పించిన వేదికను సద్వినియోగం చేసుకుని కొత్త విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతీ విషయాన్నీ సానుకూల దృష్టితో ఆలోచించాలని, దీని వల్ల ఎన్నో కొత్త ఆలోచనలు కలుగుతాయని తెలిపారు. కఠోర శ్రమతోనే ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం సాధ్యపడుతుందన్న విషయాన్ని విద్యార్థులు తెలుసుకోవాలని కోరారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, సమాజానికి ఏదైనా సేవ చేయాలన్న భావనను అలవరచుకోవాలని సూచించారు. ఇక్కడి విద్యార్థ్ధులు దేశంలో, ఇతర దేశాల్లో గొప్ప స్థానాల్లో ఉండటం హర్షణీయమని పేర్కొన్నారు. నవోదయ సంస్థల ఛైర్మన్‌ ఎస్‌.రాజేంద్రరెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్ధులు విశ్వవిద్యాలయ పరిధిలో టాప్‌ ర్యాంకులు సాధిస్తూ, క్రీడల్లో ట్రోఫిలు దక్కించుకుని కీర్తి ని తేవడం ఆనందంగా ఉందన్నారు. మెరుగైన విద్యా బోధనలకు ప్రాధాన్యమిస్తున్నందునే 32 ఏళ్ల్లుగా సంస్థ ఆదరణ పొందుతోందని తెలిపారు. వైద్య కళాశాల ద్వారా పేదలకు ఉచిత ఆరోగ్య సేవలందిస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో ర్యాంకులు సాధించిన, ట్రోఫిలు గెలుచుకున్న విద్యార్థులకు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. రిజిస్ట్రార్‌ డాక్టర్‌ తాడిపత్రి శ్రీనివాస్‌, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ దేవానంద్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఆనంద్‌, డైరెక్టర్‌ విజయకుమార్‌, దంత కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ గిరీష్‌ కట్టి, ఆసుపత్రి సీఈవో డాక్టర్‌ మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని