logo

క్యాథ్‌ల్యాబ్‌ పనులను సత్వరమే పూర్తి చేయాలి

జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో రూ.20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కార్డియాక్‌ క్యాథ్‌ల్యాబ్‌ పనులను సత్వరమే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ గౌతమ్‌ వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రిని సోమవారం ఆయన సందర్శించి

Published : 25 Jan 2022 04:29 IST

కార్డియాక్‌ క్యాథ్‌ల్యాబ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌, సూపరింటెండెంట్‌ బి. వెంకటేశ్వర్లు తదితరులు

ఖానాపురం హవేలి, న్యూస్‌టుడే: జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో రూ.20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కార్డియాక్‌ క్యాథ్‌ల్యాబ్‌ పనులను సత్వరమే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ గౌతమ్‌ వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రిని సోమవారం ఆయన సందర్శించి అత్యవసర విభాగంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్యాథ్‌ల్యాబ్‌, ఎమర్జెన్సీ విభాగం, ట్రామాకేర్‌ సెంటర్‌ పనులను పరిశీలించారు. కార్డియాక్‌ విభాగంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యే ఐ.సి.యు వార్డు, స్టంటింగ్‌, యాంజియోగ్రామ్‌ మిషన్‌, ఇతర వసతులను పరిశీలించారు. కార్డియాలజిస్ట్‌ వైద్య సేవలకు అవసరమైన టెక్నిషీయన్లు, నర్సింగ్‌ స్టాఫ్‌ నియామకాన్ని సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. అత్యవసర విభాగాలన్నీ ఒకే భవనంలో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని వీటికి ప్రత్యేక ప్రవేశ మార్గం ఉండాలన్నారు. కొవిడ్‌ ఔట్‌ పేషంట్ల విభాగాన్ని పరిశీలించారు. ఆయన వెంట డీఎంఅండ్‌హెచ్‌వో డా.మాలతి,  సూపరింటెండెంట్‌ డా.బి.వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంఓ డా. శ్రీనివాసరావు, కార్డియాలజిస్ట్‌ డా. సీతారామ్‌, నోడల్‌ అధికారి డా.సురేష్‌ పాల్గొన్నారు.
దళితబంధు లబ్దిదారులను ఎంపిక చేయాలి: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దళితబంధు పథకంలో 100 మంది లబ్దిదారులను ఎంపిక చేసి ఫిబ్రవరి 5 నాటికి జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి సంక్షేమ, రెవెన్యూ శాఖల అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో లబ్ధిదారుల ఎంపికపై దిశా నిర్దేశం చేశారు. జిల్లా మంత్రి ఆమోదం తర్వాత మార్చి 7 నాటికి యూనిట్లు గ్రౌండింగ్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. చింతకాని  మండలంలో అర్హులందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. మధిర నియోజకవర్గానికి సంబంధించి మరో 4 మండలాల్లో వంద మందిని ఎంపిక చేయాలన్నారు. సమావేశంలో నగర పాలక కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, ఇతర అధికారి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని