logo

చిత్ర వార్తలు

ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ వద్ద జరగనున్న శ్రీశ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకలకు సంఘీభావంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ధూప, దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

Published : 28 Jan 2022 05:37 IST

ద్విచక్ర వాహన ర్యాలీలో ఉభయ జిల్లాల ధూప, దీప నైవేద్య సంఘం అర్చకులు

ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ వద్ద జరగనున్న శ్రీశ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకలకు సంఘీభావంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ధూప, దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. గురువారం నగరంలోని శ్రీలక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానం నుంచి ర్యాలీని కార్యనిర్వాహక కార్యదర్శి ఆమంచి సురేశ్‌శర్మ ప్రారంభించారు. ప్రధాన ప్రాంతాల మీదుగా ర్యాలీ సాగి కూసుమంచి మండలం జీళ్లచెర్వు వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ముగిసింది. డీడీఎన్‌ఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నావజ్జుల ప్రసాద్‌శర్మ, మరింగంటి భార్గవాచార్యులు, ఉమ్మడి జిల్లా కార్యదర్శి మునగులేటి రమేశ్‌శర్మ, అర్చకులు పాల్గొన్నారు.


లారీపై రైలుబండి.. భలే చిత్రమండి!

పాల్వంచ పట్టణం మీదుగా వెళ్తున్న ఓ లారీపై పాత రైలు ఇంజిన్‌ తరలిస్తున్న దృశ్యాన్ని వాహనదారులు, పురవాసులు ఆసక్తిగా చూశారు. మణుగూరు నుంచి సికింద్రాబాద్‌కు ఈ పాత రైలింజిన్‌ను తరలిస్తున్నారు. ఈ దృశ్యాన్ని తమ చరవాణుల్లో బంధించేందుకు పలువురు స్థానికులు ఆసక్తి కనబరిచారు. భారీ లోడు కారణంగా వాహనం నిదానంగా వెళ్తుండటంతో ఒకరిని చూసి మరొకరు సెల్ఫీల జోరు కొనసాగించారు. ఇందిరానగర్‌కాలనీలో కనిపించిన ఈ చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.  

- పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని