logo

మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం

మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

Updated : 25 Apr 2024 06:15 IST

నేడు ‘ప్రపంచ మలేరియా దినోత్సవం’

కొత్తగూడెం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. గతంలో పోల్చిచూస్తే మాత్రం ఈ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పట్టణాలతో పాటు మారుమూల మన్యంలోనూ పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రజలు కాస్త శ్రద్ధవహిస్తుండటంతో మార్పు సాధ్యమవుతోంది. ఈ అంశంపైనే శాఖాపరమైన ప్రచారం జరుగుతోంది.    పంచాయతీలు, పురపాలకాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాలో కేసుల కట్టడికి చేపట్టదగిన నియంత్రణ చర్యలపై ‘ప్రపంచ మలేరియా దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం.
కుటుంబపరంగా


ఈ జాగ్రత్తలు పాటించాలి

  • ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.  
  • పనికి రాని పాత్రలు, టైర్లు, పగిలిపోయిన బకెట్లు, తొట్లు, కొబ్బరి బొండాంలను పరిసరాల్లో ఉంచొద్దు.
  • ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, సంపులు,   డ్రమ్ములపై మూతలు ఉంచాలి.
  • డ్రై డేను విధిగా పాటించాలి. నిల్వ నీరు పారబోసి పాత్రలు, డబ్బాలు ఆరబెట్టాలి.
  • ప్లాస్టిక్‌ సంచులు, కప్పులు, గ్లాసులను ఇళ్ల ముందుండే కాలువల్లో వేయొద్దు.
  • సెప్టిక్‌ ట్యాంకుల గాలి పైపులకు నైలాన్‌ జాలి కట్టాలి. ద్వారాలు, కిటికీలకు జాలిలు అమర్చుకోవాలి
  • దోమల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో తెరలు వాడుకోవాలి.
  • పంచాయతీల్లోని మురుగు ప్రాంతాల్లో యంత్రాంగం ఆయిల్‌ బాల్స్‌ వేయాలి.

గత ఎనిమిదేళ్లలో జిల్లాలో మలేరియా కేసులు బాగా కట్టడి చేయగలిగాం. మలేరియా కేసులు బయటపడిన వెంటనే గ్రామాల్లో రక్తపూతలు సేకరించి శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. జ్వరాలు తిరగబడేందుకు వీల్లేకుండా ఔషధాలు ఇస్తున్నాం. 2030 నాటికి జిల్లాలో మలేరియాను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. లక్ష్యం చేరేలా విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నాం.

డా.స్పందన, జిల్లా ప్రోగ్రాం అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు