logo

ఆ ఊట నీళ్లే వారికి అమృతం.. 30 ఏళ్లుగా తాగుతున్న ఆదివాసీలు

చర్ల మండలంలోని మారుమూల పల్లె వెంకటచెరువులో ఆదివాసీలు ఇప్పటికీ ఊటనీటినే తాగుతున్నారు.

Updated : 25 Apr 2024 13:03 IST

చర్ల: చర్ల మండలంలోని మారుమూల పల్లె వెంకటచెరువులో ఆదివాసీలు ఇప్పటికీ ఊటనీటినే తాగుతున్నారు. మంచినీటి బోర్లు ఉన్నప్పటికీ ఆ నీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తూ.. గ్రామానికి 2 కి.మీ. దూరంలో ఉన్న ఎతైన గుట్ట కింద వస్తున్న ఊట నీళ్లనే అమృతంగా భావించి తాగుతున్నారు. గతంలో ఇక్కడ ఈత చెట్టును తొర్రగా చేసి దాని నుంచి వచ్చే నీళ్లనే ఆదివాసీలు తాగేవారు. ప్రస్తుతం చెట్టు తొర్రను తొలగించి సిమెంట్‌ తూరలను ఏర్పాటు చేశారు. ఎంతో రుచిగా.. వేసవిలో మరెంతో చల్లగా ఉండే ఊట నీళ్లు తమకు అమృతం లాంటివని.. వాటిని తప్ప వేరే నీటిని తాగమని వెంకటచెరువు ఆదివాసీలు చెబుతున్నారు. ఆశ్చర్యమేంటంటే.. మండు వేసవిలోనూ చెలమల నుంచి కావాల్సినంత నీరు ఊరుతుండటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు