icon icon icon
icon icon icon

Revanth Reddy: కేసీఆర్‌.. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారు?: సీఎం రేవంత్‌

కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో కేసీఆర్‌ చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.

Published : 04 May 2024 14:31 IST

కొత్తగూడెం: కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో కేసీఆర్‌ చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్‌.. భాజపాలో చేరతారని మేం మొదటి నుంచి చెబుతున్నాం. కేంద్రంలో భాజపా చేసిన అన్ని చట్టాలకు భారాస మద్దతిచ్చింది. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు ఆ రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. గుజరాత్‌ను ఓడిద్దాం.. తెలంగాణను గెలిపించుకుందాం రండి. రైతు భరోసా ఆగిపోయిందని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 9 లోగా ఒక్క రైతుకైనా బకాయి ఉంటే క్షమాపణ చెబుతా. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ అమలు చేసి హరీశ్‌రావు నోరు మూయిస్తాం

రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్‌ వైఖరిని ఖమ్మం జిల్లా ప్రజలు ముందే పసిగట్టారు. అందుకే 2014, 2019, 2023లో భారాసను దూరం పెట్టారు. ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు.. ముందుచూపు ఎక్కువ. పదేళ్ల పాటు తెలంగాణకు ద్రోహం చేసింది భాజపానే. ఈ పదేళ్లలో రాష్ట్రానికి ఒక్కటైనా ఇచ్చారా? రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శే చెప్పారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకునేందకు కాంగ్రెస్‌ను గెలిపించాలి. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన కాషాయ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. రూ.7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని కేసీఆర్‌ మాకు అప్పగించారు. భట్టి విక్రమార్క గట్టి వ్యక్తి కాబట్టి నిధులు సర్దుతున్నారు. అన్ని వర్గాల ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img