logo

రాజకీయాలకు అతీతంగా అండగా నిలుస్తా: నామా

రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉంటానని ఖమ్మం లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.

Published : 06 May 2024 01:54 IST

రాపర్తినగర్‌లో క్రికెట్‌ ఆడుతున్న నామా నాగేశ్వరరావు

ఖమ్మం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉంటానని ఖమ్మం లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. రాపర్తినగర్‌ మైదానంలో వాకర్లను ఆదివారం కలిసి ఓట్లు అభ్యర్థించారు. యువకులతో క్రికెట్‌ ఆడారు. కార్పొరేటర్‌ దోరేపల్లి శ్వేత పాల్గొన్నారు.

కొణిజర్ల, వైరా, తల్లాడ, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. వైరా, కొణిజర్లతోపాటు తల్లాడ మండలం కుర్నవల్లిలో ఆదివారం ప్రచారం చేశారు. జిల్లాలో రూ.8వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణానికి కృషి చేశానని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. పదేళ్లు కష్టపడి భారాస ప్రభుత్వం తెలంగాణను గాడిన పెడితే కాంగ్రెస్‌ వచ్చి మళ్లీ పదేళ్లు వెనక్కి తీసుకెళ్లిందని విమర్శించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోత్‌ మదన్‌లాల్‌, కూరాకుల నాగభూషయ్య, ఆర్‌జేసీ కృష్ణ, జడ్పీటీసీ సభ్యులు పోట్ల కవిత, తదితరులు పాల్గొన్నారు.


కృత్రిమ మేధతో తప్పుడు ప్రచారం: పువ్వాడ

ఖమ్మం కార్పొరేషన్‌: డీప్‌ఫేక్‌ ఆడియోలు, కృత్రిమ మేధతో తనపై తప్పుడు ఆడియోలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. గత ఎన్నికల్లో ఇలాగే కొంతమంది తప్పుడు ప్రచారం చేశారని, వీటిని కొన్ని పత్రికలు, మీడియా ప్రచారం చేయటాన్ని ఆయన ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని