logo

కేంద్ర హోంమంత్రిపై ఆరోపణలు చేశారని.. సీఎం రేవంత్‌రెడ్డిపై భాజపా ఫిర్యాదు

కొత్తగూడెంలో ఈ నెల 4న నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి భాజపాపై అసత్య ఆరోపణలు చేశారని, దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగాకిరణ్‌ కొత్తగూడెం డీఎస్పీ షేక్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌, ఒకటో పట్టణ సీఐ కరుణాకర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు.

Published : 07 May 2024 02:19 IST

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: కొత్తగూడెంలో ఈ నెల 4న నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి భాజపాపై అసత్య ఆరోపణలు చేశారని, దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగాకిరణ్‌ కొత్తగూడెం డీఎస్పీ షేక్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌, ఒకటో పట్టణ సీఐ కరుణాకర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని, రిజర్వేషన్లు రద్దవుతాయని, ఈ మాటలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నట్లుగా సీఎం అసత్య ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని రంగాకిరణ్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు