logo

కొలువుల గుట్టు.. నియామకాల్లో కనికట్టు

ఉమ్మడి జిల్లాలో ఐసీటీసీ, పీపీటీసీటీ కేంద్రాల్లో ఒప్పంద పద్ధతిలో కౌన్సిలర్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 07 Dec 2022 04:05 IST

ఎయిడ్స్‌ విభాగంలో ఒప్పందం తీరిది

ఆదోని పురపాలకం న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో ఐసీటీసీ, పీపీటీసీటీ కేంద్రాల్లో ఒప్పంద పద్ధతిలో కౌన్సిలర్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 11 కౌన్సిలర్‌ పోస్టులకు వైద్య ఆరోగ్య శాఖ ఈ ఏడాది ఆగస్టు 22న ప్రకటన విడుదల చేసింది. వీరికి ఒక్కో నెలలో రూ.21 వేలు. డీఎస్సీ విధానంలో ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఇందులో జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో డీఎంఅండ్‌హెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌, అదనపు డీఎంఅండ్‌హెచ్‌వో, డీటీసీవో.. ఇలా కమిటీని నియమించారు. వీటి భర్తీలో అనుసరించిన విధానాలు చర్చకు దారితీస్తున్నాయి.  

ఎన్నో అనుమానాలు

* తుది జాబితాలో నలుగురు ఎన్జీవోలకు చోటు కల్పించారు. వారిని ప్రాజెక్టు మేనేజర్లుగా నియమించడానికి అర్హత ఉంటుంది.. అలాంటిది కౌన్సిలర్‌ పోస్టుకు ఎంపిక చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరంతా అధికార పార్టీకి చెందిన వారుకావడంతో వెయిటేజ్‌ మార్కులు కల్పించలేదంటూనే జాబితాలో మార్కులు కలిపినట్లుగా సమాచారం. వీరికి స్థానం కల్పిస్తామో లేదో చివరి జాబితాలో చూసుకోవాలని అధికారులు కొత్తభాష్యం చెబుతున్నారు.

* కొందరు అభ్యర్థులకు ఏడాది అర్హత పత్రం ఉన్నా.. కచ్చితం కాకపోవడంతో సమర్పించుకోలేకపోయారు. కనీసం చివరి క్షనా గ్రీవెణంలోనైన్స్‌ ద్వారా సమర్పించుకోవచ్చనే మాటను చెప్పలేదు. దీంతో చాలా మంది అవకాశం కోల్పోయారు.

ఎంపిక చేసి.. న పెపక్కట్టి

* గత నెలలో 149 మంది అభ్యర్థులతో కూడిన ప్రొవిజనల్‌ జాబితా, మరో 15 రోజులకు 135 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను విడుదల చేశారు. గత వారంలో 23 మందితో కూడిన రివైజ్డ్‌ మెరిట్‌ జాబితా విడుదల చేశారు. సుమారు 112 మందిని పక్కన పెట్టేశారన్న మాట.

* తుది జాబితాలో నలుగురు పేర్లు రావడంపై సరైన నిబంధనలు పాటించలేదని సమాచారం. ఉద్యోగానికి విద్యా అర్హత ఎంఏ, ఎమ్మెస్సీ పీజీ హోల్డర్‌ అయి ఉండి, సైకాలజీ సామాజిక కార్యకర్త, సోషియాలజీ, అంథ్రోపాలజీ, హెచ్‌డీ విద్య అర్హతగా నిర్ణయించారు. దీంతో పాటు ఆరోగ్య విభాగం, హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ విభాగంలో ఏడాది అనుభవం ఉండాలంటూనే, మెంటర్‌గా పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి 2.5, గ్రామీణ ప్రాంతాల్లో 2, అర్బన్‌లో చేసిన వారికి ఒక మార్కు, కొవిడ్‌ సేవల్లో ఉన్న వారికి ఆరు నెలలైతే 5, ఏడాదైతే 10, ఏడాదిన్నర అయితే 15 మార్కులు వెయిటేజీ కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని