logo

అరాచక పాలన అంతమే లక్ష్యం

జగన్‌ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ చింతా సురేష్‌ బాబు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌, కర్నూలు పార్లమెంట్ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌తో కలిసి ఎన్‌డీఏ ఛార్జిషీటును తిక్కారెడ్డి శుక్రవారం విడుదల చేశారు.

Published : 27 Apr 2024 05:17 IST

ఛార్జిషీటును చూపుతున్న కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి, పక్కన కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌ తదితరులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జగన్‌ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ చింతా సురేష్‌ బాబు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌, కర్నూలు పార్లమెంట్ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌తో కలిసి ఎన్‌డీఏ ఛార్జిషీటును తిక్కారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. వారు మాట్లాడుతూ జగన్‌ అరాచక పాలన అంతం చేసేందుకే ఎన్‌డీఏ పక్షాలు జగన్‌పై ఛార్జీషీట్‌ వేసినట్లు చెప్పారు. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పులతో ఒక్కో కుటుంబంపై రూ.10 లక్షల భారం మోపినందుకు, ల్యాండ్‌, శాండ్‌, మైనింగ్‌, గంజాయి, డ్రగ్స్‌, ఎర్రచందనం, రేషన్‌ బియ్యంలో రూ.8 లక్షల కోట్లు కొట్టేసినందుకు.. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలను దెబ్బతీసినందుకు జగన్‌రెడ్డిపై ఛార్జిషీట్‌ వేశామన్నారు. పదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచి రూ.75 వేల కోట్ల భారాలు మోపినందుకు, ఇసుక ధరలు నాలుగురెట్లు పెంచడం, 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతీసినందుకు ఛార్జిషీటు వేసినట్లు తెలిపారు.   కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తామని చెప్పి.. కనీసం బెంచ్‌ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. జగన్‌రెడ్డికి మరోసారి అవకాశమిస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే లేకుండా చేస్తారని అన్నారు. ఓటు అనే ఆయుధంతో జగన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని