logo

ఇంతులు ఎటో గెలుపు అటే

సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో పురుష ఓటర్లు 10,13,771, మహిళలు 10,40,435, ఇతరులు 318 కలిపి 20,54,524 మంది ఓటర్లు ఉన్నారు.

Updated : 27 Apr 2024 05:23 IST

జిల్లాలో ఓటర్ల సంఖ్య 20.54 లక్షలు
56 వేల మంది యువత ఓటుకు దూరం

తుది ఓటరు జాబితా విడుదల

సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో పురుష ఓటర్లు 10,13,771, మహిళలు 10,40,435, ఇతరులు 318 కలిపి 20,54,524 మంది ఓటర్లు ఉన్నారు. తుది జాబితాను ఎన్నికల సంఘం ఈనెల 25న విడుదల చేసింది. రాష్ట్రంలోనే పాణ్యం నియోజకవర్గంలో అత్యధిక మంది ఓటర్లు ఉన్నారు.. ఇక్కడ 3,31,705 మంది ఓటర్లు ఉండగా ఆ తర్వాత కర్నూలు 2,74,446, ఆదోనిలో 2,63,056 మంది ఓటర్లు ఉన్నారు. 2,08,350 మంది ఓటర్లతో మంత్రాలయం నియోజకవర్గం చివరి స్థానంలో నిలిచింది.

ఆరింటిలో మహిళలదే పైచేయి

కర్నూలు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో కోడుమూరు, ఆలూరు నియోజకవర్గాలు మినహా మిగతా నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. తాజాగా విడుదల చేసిన తుది జాబితాలో పురుష ఓటర్లు 10,13,771, మహిళా ఓటర్లు 10,40,435 మంది, ఇతరులు 318 మంది ఉన్నారు. పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లు 26,664 మంది అధికంగా ఉండటం విశేషం. పాణ్యంలో అత్యధికంగా 9,011, కర్నూలు 8,899, మంత్రాలయం 4,017, ఎమ్మిగనూరు 3,621, ఆదోని 2,280, పత్తికొండలో స్వల్పంగా 378 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కోడుమూరులో 378, ఆలూరు 1,222 మంది పురుష ఓటర్లు మహిళా ఓటర్ల కంటే ఎక్కువగా ఉన్నారు.

  • 18-19 ఏళ్ల వయస్సు ఉన్న యువత కర్నూలు జిల్లాలో 1,10,188గా ఉంది. మార్చి 23న విడుదల చేసిన ఓటరు జాబితా ప్రకారం 49,471 మంది ఓటర్లుగా నమోదయ్యారు. నెల రోజుల వ్యవధిలో 4 నుంచి 5 వేల మంది  ఓటర్లుగా నమోదై ఉంటారు.. ఈ లెక్కన 54 వేల మంది యువత ఓటర్లుగా ఉంది. మరో 56,188 మంది  హక్కుకు దూరమయ్యారు.

నెల రోజుల్లో 23,035 మంది పెరుగుదల

2024 అంచనా జనాభా ప్రకారం జిల్లాలో 18 నుంచి 80 ఏళ్లకుపైగా 21,35,927 మంది జనాభా ఉంది. 8 నియోజకవర్గాల పరిధిలో తుది ఓటరు జాబితా ప్రకారం 20,54,524 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది మార్చి 23న విడుదల చేసిన జాబితాతో పోలిస్తే నెల రోజుల వ్యవధిలో 23,035 మంది ఓటర్లు పెరిగారు. పాణË్యంలో అత్యధికంగా 5,806, మంత్రాలయంలో అత్యల్పంగా 1,710 మంది పెరిగారు.

అందుబాటులో లేని జాబితా

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ వచ్చే నెల 13న జరగనుంది. ఇప్పటివరకు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా ప్రజల చెంతకు చేరలేదు. తమకు ఓటు హక్కు ఉందో? లేదో? జనానికి తెలియని పరిస్థితి. తుది ఓటరు జాబితాను బీఎల్వోలు ప్రజలకు తెలపాల్సి ఉంది. అలాచేస్తేనే పోలింగ్‌ రోజున ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించిన జాబితాను అందుబాటులో ఉంచాలి.

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు