logo

సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన

రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామివారి బృందావనానికి నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు.

Published : 27 Apr 2024 05:25 IST

మేళతాళాలతో పట్టు వస్త్రాలు తీసుకువస్తున్న తితిదే డిప్యూటీ ఈవో లోకనాథ్‌, ఆలయాధికారులు

మంత్రాలయం, న్యూస్‌టుడే: రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామివారి బృందావనానికి నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు. తితిదే డిప్యూటీ ఈవో లోకనాథ్‌ శ్రీవారి పట్టు వస్త్రాలను మంత్రాలయం తీసుకువచ్చారు. వేదపండితులు, అర్చకులు, అధికారులు మేళతాళాలలతో స్వాగతం పలికారు. ఊంజల మండపంలో వెండి సింహాసనంపై శ్రీవారి పట్టు వస్త్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తితిదే డిప్యూటీ ఈవో లోకనాథ్‌ పీఠాధిపతికి శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించి సత్కరించారు. అనంతరం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల బృందావనానికి శ్రీవారి పట్టు వస్త్రాలను అలంకరించి హారతి ఇచ్చారు. బంగారు రథంపై స్వామివారి చిత్రపటాన్ని ఉంచి మఠం ప్రాకారంలో ఊరేగించారు. మధ్యారాధన సందర్భంగా తితిదే దాససాహిత్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో, కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోటె అనంత కులకర్ణి, కొప్పల్‌కు చెందిన సుప్రియా ప్రవీణ్‌, బీజాపూర్‌కు చెందిన సులేఖ కులకర్ణి తదితరులు శ్రీమఠం ప్రవచన మందిరంలో దాసవాణి కార్యక్రమం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు