logo

మద్యం దుకాణం ఎత్తివేయాలని మహిళల ధర్నా

మద్యం దుకాణాలను ఎత్తివేయాలని ఆంధ్ర ప్రదేశ్‌ మహిళా సమాఖ్య పట్టణ సమితి సభ్యులు ఈరన్న, నాగలక్ష్మి, సరోజ డిమాండ్‌ చేశారు.

Published : 04 Feb 2023 03:52 IST

ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న మహిళలు

ఎమ్మిగనూరు పట్టణం, న్యూస్‌టుడే: మద్యం దుకాణాలను ఎత్తివేయాలని ఆంధ్ర ప్రదేశ్‌ మహిళా సమాఖ్య పట్టణ సమితి సభ్యులు ఈరన్న, నాగలక్ష్మి, సరోజ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ పెద్దబావి సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడంతో మహిళలు, చిన్నారులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. వేణు విద్యాలయం విద్యార్థులు, ఆలయానికి వెళ్లే భక్తులు తిరుగుతుండగా మద్యం బాబులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. నిబంధనల ప్రకారం బడి, గుడి సమీపంలో మద్యం దుకాణం ఉండరాదన్నారు. ఉమా, సరోజ, అరుణ, పార్వతి, శారద, సరస్వతి, లక్ష్మి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని